సృష్టి కర్త అమ్మ.... సృష్టి దైవం అమ్మ.. ( Mothers day special kavitha or poem - telugu)
నవ మాసాలు మోసి మనకి రూపమిచ్చె దైవం అమ్మ...
కనులు తెరిచిన క్షణాన తానే తొలి పరిచయమై కనిపించే అమ్మ..
ఆత్మీయత పంచుతూ పొత్తిళ్ళలో దాచి కాపాడే స్నేహం అమ్మ..
నేనేతి గోరుముద్ధలతో లాలించి పాలించే మాతృరూపం అమ్మ...
బుడిబుడి అడుగులు నేర్పిస్తూ తొలి పాటక్షరమయిన "అ.. అమ్మ"
తనని త్యాగం చేస్తూ మన ఎదుగుదల కోరే అమ్మ...
తుది శ్వాస వరకు మనకై తపించే అమ్మ..
సృష్టి కర్త అమ్మ.... సృష్టి దైవం అమ్మ..
copyright © mee telugabbayi
Comments
Post a Comment